TV9 Telugu

18 March 2024

ఉందిలే మామిడి కాలం.. ముందుముందునా 

మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడతాయి. ఇందులో సుగుణాలు చర్మానికి తేమను అందించి, నిగనిగలాడేలా చేస్తుంది.

మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

మామిడి పండ్లు ఐరన్‌కు పెట్టింది పేరు. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి మామిడి పండ్లు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ సీజన్‌లో రోజూ వీటిని తీసుకోవాలి.

మామిడి ఊబకాయం సమస్యకు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్‌, ఫైబర్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 

మామిమి పండ్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని సూచిస్తున్నారు. 

జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా మామిడి పండు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా మామిడి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని బిటాకెరోటిన్ అనే పదార్థం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.