కచ్చితంగా జామ తినాల్సిందే.. 

Narender Vaitla

23 September 2024

రోగనిరోధక శక్తిని పెంచడంలో జామపండు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ సి తక్కువ జబ్బు పడేలా చేయడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్‌ పేషెంట్స్‌కి కూడా జామ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌. రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

ఇక జామలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భోజనానికి ముందు జామను తీసుకుంటే మరింత మేలు చేస్తుందని చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ జామను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.

అలాగే ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ మెరుగైన జీర్ణక్రియను కల్పిస్తుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో జామ ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ కణాల వృద్ధిని అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది.

జామపండులో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది. కేటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.