రోజూ ఒక్క లవంగం తినండి చాలు.. 

Narender Vaitla

17 September 2024

లవంగాల్లో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తింటే బీపీ ఇట్టే తగ్గిపోతుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా లవంగం ఎంతగానో ఉపయోపడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక లవంగం నమిలితే నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

లవంగాలు పంటి సమస్యలను దూరం చేస్తుంది. పంటి నొప్పి, దంతాలు పుచ్చిపోవడం వంటి సమస్యలను లవంగాలు దూరం చేస్తాయి. మార్కెట్లో లవంగంతో చేసిన పేస్ట్‌లు కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

బరవు తగ్గాలనుకుంటున్నారా అయితే రోజూ లవంగాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ మెరుగుపడి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

ఇక లవంగాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

రోజు లవంగాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ వచ్చే వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు.

ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కూడా లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులోని మంచి గుణాలు ఒత్తిడిని కంట్రోల్‌ చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.