దాల్చిన చెక్కను క్రమం తప్పుకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి డయాబెటిస్ బారిన పడే వారు కచ్చితంగా దాల్చిన చెక్కను తీసుకోవాలి.
దాల్చిన చెక్కలోని యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు దరి చేరనివ్వదు.
మెదడు పనితీరును మెరుగుపరచడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, అల్జీమర్స్ వ్యాధిని అరికట్టడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్కలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్, కొవ్వును తగ్గించడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది.
దాల్చిన చెక్క పురుషుల ఆరోగ్యాన్ని బాగు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంగస్తంభన వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది.
దాల్చిన చెక్కను క్రమం తప్పుకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్కను పేస్టులా చేసుకొని జుట్టుకు రాసుకుని తలస్నానం చేస్తే.. జట్టు ఒత్తుగా, దృఢంగా మారుతుంది.