19 September 2023
వంకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నిషియంలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి పోషణ లభిస్తుంది.
వంకాయలో పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ బి1, బి2, బి3, బి6లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణవ్యవస్థలో ఏవైనా సమస్యలు ఉంటే పోతాయి. అలాగే మూత్రాశయ సమస్యలు కూడా తగ్గుతాయి.
వంకాయలో నీరు ఎక్కువ, కేలరీలు తక్కువ..కరిగే పైబర్ ఎక్కువ. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. అలాగే విష వ్యర్థాలను తొలగిస్తుంది.
వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
వంకాయలను రెగ్యులర్‌గా తింటే హైబీపీ తగ్గుతుంది. అల్సర్ తగ్గుతుంది. వంకాయలను తరచూ తింటే రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లు, ఎల్‌డీఎల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
వంకాయల్లో ఉండే ఆంథోసయనిన్స్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. దీనిలో ఉన్న నాసునిన్ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.
వంకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. వంకాయలను నిప్పుపై కాల్చి, ఉప్పు కారంతో తింటే అధిక కఫాన్ని నివారింస్తుంది. శరీరం సమతుల్యం చేస్తుంది.