పుచ్చకాయలే కాదు, వాటి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమే..

పుచ్చకాయలే కాక వాటి విత్తనాలు కూడా  ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

పుచ్చకాయ గింజల్లో ప్రొటీన్లు, విటమిన్స్‌, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. 

ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు సమస్యలను దూరం చేస్తాయి. 

పుచ్చకాయ గింజల్లోని పొటాషియం, జింక్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఇవి జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను కూడా తొలగిస్తాయి. 

ఈ గింజల్లో తక్కువ కేలరీలు ఉన్నందున బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.

పుచ్చకాయ గింజల్లో ఉండే ప్రొటీన్, ఫోలేట్ వంటి పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. 

పుచ్చకాయ గింజలను పేస్టులా చేసి చర్మానికి రాసుకుంటే చర్మం మెరుస్తుంది.

పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి.

డయాబెటిక్ పేషెంట్లకు ఇవి బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయడంతో ఉపయోగపడతాయి.