జీడిపప్పులోని మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తనాళాలు గట్టిపడకుండా చూస్తాయి. గుండె సమస్యలు దారిచేర నివ్వదు.
పిస్తాలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొవ్వును కరిగించడంలో పిస్తా కీలక పాత్ర పోషిస్తుంది.
ఎండుద్రాక్ష విటమిన్లకు పెట్టింది పేరు. ఇవి ఎముక పుష్టికి ఉపయోగపడుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది.
బాదంపప్పులోని క్యాల్షియం, విటమిన్ ఇ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మం ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.
వాల్ నట్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కు పెట్టింది పేరు. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాల్‌నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
అంజీర పండ్లు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మలద్దకం సమస్య పరార్ అవుతుంది. కడుపులో ఉన్న వ్యర్థాలు తొలగిపోవడంలో ఉపయోగపడుతుంది.
ఎండు ఖర్జూరం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్త హీనత సమస్యకు ఖర్జూరం చక్కటి పరిష్కాకరంగా చెప్పొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటిండచమే ఉత్తమం.