ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ ఎక్కువగా ఎటాక్ చేస్తుంది.
మధుమేహం రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
షుగర్ ఉన్నవారు ఏది పడితే అది తినకూడదు. ఆహారం కూడా చాలా లిమిట్‌గా తీసుకుంటూ ఉండాలి. లేదంటే షుగర్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి.
ఈ క్రమంలోనే షుగర్ వ్యాధితో బాధపడేవారు టమాటాలు ఎక్కువగా తినకూడదని అంటారు. మరి టమాటాలు తినొచ్చా? లేదా?
డయాబెటీస్‌తో ఉండే వారు ఎలాంటి డౌట్ లేకుండా టమాటాలు తీసుకోవచ్చు. టమాటాలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు అనేవి నిర్వహించేందుకు హెల్ప్ అవుతుంది. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
టమాటాను డయాబెటిక్ ఫ్రెండ్లీ వెజిటేబుల్ అని చెబుతారు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్లు కూడా ఎలాంటి భయం లేకుండా టమాటాలను తినవచ్చు. టమాటాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. డైట్ ఫాలో అయ్యే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి