పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.
క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు పోట్లకాయలో ఉన్నాయి. పొట్లకాయలను తరచుగా తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలు ఉండవు. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.
జ్వరం వచ్చిన వారు, కామెర్లు అయిన వారు ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు. అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాల్షియం అధికంగా ఉంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. పొట్లకాయలలో ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జ్వరాన్ని తగ్గించగలవు. జ్వరం వచ్చిన వారు ఈ కాయలను తింటే త్వరగా జ్వరం తగ్గుతుంది.
పొట్లకాయ ఆకులను శరీరంపై రుద్దుతూ ఉంటే కూడా జ్వరం తగ్గుతుంది. అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం, అలసట ఉండవు. ఈ కాయలను తినడం వల్ల కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనాలు శరీరానికి లభిస్తాయి.
ఇవి రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో కామెర్లు తగ్గుతాయి. వీటిని ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెర్లు త్వరగా నయం అవుతాయి.
గుండె దడ, ఛాతి నొప్పి, హైబీపీ, ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజూ 30 ఎంఎల్ మోతాదులో అయినా సరే పొట్లకాయ రసం తాగుతుండాలి. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
పొట్లకాయ పేస్ట్‌తో హెయిర్‌ప్యాక్ వేసుకుంటే శిరోజాలకు పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు, ఇతర జుట్టు సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి ఉండదు.