గంజి తాగ‌డం వ‌ల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

10 October 2023

ఇప్పుడు గంజిని వృథాగా పడేస్తున్నారు. అయితే పోషకాహార నిపుణులు గంజితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని.. పడేసే ముందు ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నారు

పోషకాహార నిపుణులు

గత కొంత కాలం క్రితం వరకూ పెద్దలు తినే ఆహారంలో గంజి కూడా ఒకటి. ఈ గంజి తాగ‌డం వ‌ల్ల ఎన్నో అద్బుత‌మైన ఆరోగ్యప్రయోజనాలున్నాయి

గంజి తాగ‌డం వ‌ల్ల

బద్ధకంగా ఉన్నా, తక్షణ శక్తి కావాలన్నా గంజి ఉత్తమ ఆహారం.. వేడి వేడి గంజిలో కాస్త ఉప్పు, కారం క‌లిపి తాగితే  చురుగ్గా ప‌నిచేస్తారు

తక్షణ శక్తి కోసం 

జ్వరంతో బాధపడుతుంటే ముఖ్యంగా మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వచ్చిన వారు గంజిని తాగితే జ్వరం తగ్గుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది

ఉష్ణోగ్రత నియంత్రణ 

జుట్టు రాలుతున్నా, చుండ్రు తో ఇబ్బంది పడుతున్నా గంజిని తల‌కు ప‌ట్టించి కొంత సేపటి తర్వాత  త‌ల‌స్నానం చేయాలి. దీంతో శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

జుట్టు రాలుతుంటే 

జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా తరచుగా అలసట బారిన పడుతున్నా గంజి తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. గంజిలో అనేక పోషకాలున్నాయి. 

జీర్ణ సమస్యల నివారణకు 

గంజి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముఖానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది. స్కిన్ యవ్వనంగా ఉంచుతుంది.  

స్కిన్ కేర్ గా 

ఎన్నో అద్భుత‌మైన లాభాలున్న గంజి వృధాగా పడేయకుండా క్రమం తప్పకుండా రోజూ తాగండి. ఆరోగ్యంగా ఉండండి. 

అద్భుత‌మైన లాభాలు