బొప్పాయి ఆకుల రసం... మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలదు. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది.
బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది.
చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద, జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా... షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది.
బొప్పాయి ఆకుల రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది.
బొప్పాయి ఆకుల్లో ఉండే ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ అనే పోషకాలు యాంటీఆక్సిడెంట్లలా పని చేసి... శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది.
గుండెలో నొప్పిగా ఉంటోందా, ఏదో అసౌకర్యంగా అనిపిస్తోందా... అయితే... బొప్పాయి ఆకుల రసం తాగితే మేలు. ఆకలి పెరగాలన్నా ఇది తాగొచ్చు.