11 August 2023

ఆ రుచే వేరబ్బా.. కడక్‌నాథ్ మాంసం ఆరోగ్య ప్రయోజనాలివే.. 

మార్కెట్‌లో సాధారణ కోడి మాంసం ధర రూ. 200 ఉంటే.. కడక్‌నాథ్ కోళ్ల మాసం ధర ఏకంగా రూ.1200 వరకు ఉంటుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. 

మటన్ మాంసం కంటే కూడా అధిక ధర ఉన్న ఈ కడక్‌నాథ్ కోడి మాంసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.

సాధారణ కోడి కంటే అధిక మొత్తంలో పోషకాలకు కలిగిన కడక్‌నాథ్ కోడి మాంసంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కడక్‌నాథ్ కోళ్ల మాంసంలో దాదాపు 25 శాతం ప్రోటీన్ ఉంటుంది. శరీర ఆరోగ్యం, శారీరక నిర్మాణానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ప్రెగ్నెంట్స్, అథ్లెట్స్, బరువు పెరగాలనుకునేవారికి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. 

గుండె సమస్యలకు కారణమయ్యే కొలెస్ట్రాల్ కడక్‌నాథ్ కోళ్ల మాంసంలో చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా బీపీ, గుండె సమస్యల భయం లేకుండా దీన్ని తినవచ్చు. 

కండరాల నిర్మాణానికి కావాల్సిన అమైనో యాసిడ్లకు కూడా కడక్‌నాథ్ కోళ్లు మంచి మూలం. ఈ యాసిడ్లు శరీరంలోని కణాల అభివృద్ధికి ప్రయోజనకరం. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

అలాగే ఇందులోని విటమిన్ బి, బి1, బి2, బి6, బి12, ఇ పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ బి బాడీ మెటబాలిజాన్ని.. విటమిన్ ఇ మెరిసే చర్మం, కేశాలను అందిస్తుంది. 

ఈ కోళ్ల మాంసంలోని ఐరన్ రక్తహీనతను.. కాల్షియం, ఫాస్పరస్ బోలు లేదా బలహీనమైన ఎముకలను అరికడతాయి. సాధారణ కోడి మాంసం కంటే కడక్‌నాథ్ కోళ్ల మాంసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.