ఉలవలు చాలా రుచికరమైన ఆహారం. అయితే చాలా మందికి ఉలవల గురించి తెలియని విషయం ఏమిటంటే.. ఇవి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరమే.
ఉలవలను ఆహారంలో భాగంగా వారంలో ఒక్కసారి తీసుకున్నా అన్ని రకాల సమస్యలు దూరంగా ఉంటాయి. వీటిల్లోని పోషక గుణాలే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కంటెట్ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాక కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, జింక్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
ముందుగా చెప్పుకున్నట్లుగా ఉలవల్లో ఫైబర్ ఉంటుంది. ఈ కారణంగా ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే అజీర్తి, మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఉలవలు డయాబెటిస్ ఉన్నవారికి కూడా ప్రయోజనకరమే. ఇందులో గ్లైసెమిక్ ఇండకె్స్ తక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్‌పై ప్రభావం ఉండదు.
అలాగే ఉలవల్లోని కాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలను పటిష్టం చేయడంలో సహకరిస్తాయి. అలాగే బోలు ఎముకల సమస్యలను నిరోధిస్తాయి.
ఉలవల్లో ఉండే ఫినాలిక్ కంపౌండ్స్ కొలెస్ట్రాల్‌ని కరిగించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఫలితంగా రక్తపోటు, గుండెపోటు సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
ఇంకా ఉలవల్లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మ, కేశాల సంరక్షణలో అవసరమైనవి. ఈ లక్షణాల కారణంగా చర్మం, కేశాల సమస్యలు దూరమవుతాయి.