చిన్నగా ఉన్నాయని తక్కువగా చూడొద్దు..! ఉదయాన్నే ఇలా వాడితే..
Jyothi Gadda
08 March 2024
చియా సీడ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలలో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. జీర్ణశక్తి పెరుగుతుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చాలా అవసరం.
ఉదయం పూట ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన చియా సీడ్స్ తీసుకుంటే.. మీకు సంపూర్ణత్వ భావన పెరుగుతుంది, ఆహారాన్ని శోషించడాన్ని నెమ్మదిస్తుంది. తద్వారా మీరు తక్కువ కేలరీలు తినేలా చేస్తుంది. దీంతో మీరు త్వరగా బరువు తగ్గుతారు.
వీటిలో అమైనో యాసిడ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదల, రిపేర్‌కు ప్రొటీన్ అవసరం. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది.
చియా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ - ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా గింజలు నానబెట్టి తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది.
చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చియా విత్తనాల్లో రోజువారీ సిఫార్సు చేసిన కాల్షియంలో 18% కలిగి ఉంటాయి. కాల్షియం మీ ఎముకలు, దండాలను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది.
ప్రతిరోజూ 37 గ్రాముల చియా గింజలను తినడం వల్ల హెచ్‌ఎస్-సిఆర్‌పి వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను 40% తగ్గించవచ్చని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.
రాత్రంతా నీటిలో నానబెట్టిన ఒక చెంచా చియా గింజలను మీ ఉదయం పూట నిమ్మ, తేనె వాటర్‌లో మిక్స్ చేసుకుని తాగొచ్చు. ఈ డ్రింక్ శరీరం నుంచి విషాన్ని, వ్యర్థపదార్థాలను తొలగిస్తుంది. ఈ డ్రింక్ బెల్లీ ఫ్యాట్‌ను ఈజీగా కరిగింపజేస్తుంది.