మామిడి విందుకు సిద్ధమేనా..?ఈ సుగుణాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

13 March 2024

Jyothi Gadda

మామిడి పండుతో చర్మం సౌందర్యం రెట్టింపు అవుతుంది. చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను తట్టుకొనే సామర్థ్యం లభిస్తుంది.

మామిడిలో ఉండే విటమిన్ B6 చర్మంలోని సెబమ్‌ను తగ్గిస్తుంది. మామిడి పండ్లలోని పొటాషియం చర్మానికి తేమ అందిస్తుంది. మామిడి పండ్లలోని మెగ్నీషియం మొటిమలు, చర్మం జిడ్డును తగ్గిస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నోరాటిరియోల్, రెస్వెరాట్రాల్, మాంగిఫెరిన్, క్వెర్సెటిన్‌లు UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.  మామిడి పండ్లను స్కిన్ మాస్క్‌లా ముఖానికి రాసుకుంటే మొటిమల వల్ల కలిగే మంట తగ్గుతుంది.

మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్-C, ఫైబర్ శరీరానికి హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినండి. మామిడి పండ్లలో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు మంచి ఔషదం కూడా. ఇందులో ఉండే కాపర్ వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి.

మామిడి పండ్లలో విటమిన్-C తోపాటు విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ K, ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు.

మామిడి పండ్లను తినడం శృంగార వాంఛలు పెరుగుతాయి. మామిడి పండ్లలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. చర్మ సౌందర్యానికి మామిడిని మించిన పండు లేదు.

మీకు పంటి సమస్యలు ఉంటే తప్పకుండా మామిడి పండును తినండి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, బ్యాక్టీరియ వంటి సమస్యల తొలగిపోతాయి. పైగా దంతాలపై ఉండే ఎనామిల్‌ బలోపేతం అవుతుంది.