Black Grapes: నల్ల ద్రాక్ష తింటే అందంతో పాటు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే..

24 December 2023

నల్ల ద్రాక్షలో  సీ-విటమిన్‌, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి.  నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. 

మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. యవ్వనంగా కనిపించేందుకు దోహదం చేస్తుంది. 

నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతాయి, నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్‌ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. 

ఊబకాయంతో బాధపడుతున్నవారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకుంటే.. రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఆపుతుంది. ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.

నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మానసిక కార్యకలాపాలను నయం చేసుకోవచ్చు. మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.

షుగర్‌ బాధితులకు మంచిది. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాటల్ అనే పదార్ధం రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడం ద్వారా శరీరంలోని చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.