మధుమేహం లాంటి ప్రమాదకర వ్యాధులకు దివ్యౌషధం మారేడు ఆకు. దీనిని పూజలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
మధుమేహం – కొలెస్ట్రాల్ తగ్గించడానికి దీనిని తినవచ్చు. బిల్వపత్రాన్ని డైలీ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. బిల్వపత్రంను మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది.
కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. శరీర దుర్వాసనను, డయాబెటిస్ ను తగ్గిస్తుంది. అందుకే.. అనేక ఔషధాల తయారీలో మారేడును ఉపయోగిస్తారు.
పూజలో ఉపయోగించే బిల్వపత్రంను తీసుకోవడం వల్ల మధుమేహం కొలెస్ట్రాల్‌ని నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంలో బిల్వపత్రం చాలా మేలు చేస్తుంది. బిల్వపత్రం (మారేడు) కషాయాలను తాగడం ద్వారా లేదా నమలడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈరోజుల్లో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారికి బిల్వపత్రం చాలా మంచిది.. మారేడు తీసుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
మారేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది.. వాస్తవానికి మారేడు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.. ఇవి చర్మ సమస్యలను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.. మారేడు తీసుకోవడం వల్ల చర్మం మంట తగ్గుతుంది
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.