09 January 2024
TV9 Telugu
అరటి పువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధులకు చెక్ పెట్టె ఆహారపదార్ధాల్లో ఒకటి. ఇది అనేక రోగాలకు ఔషధం వంటింది.
అరటి పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, మినరల్స్ కంటెంట్ కూడా ఎక్కువే. అరటి పువ్వులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక.
క్వెర్సెటిన్, కాటెచిన్ సమ్మేళనాలు అధికగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
అరటి పువ్వులోని పోషకాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లను తొలగించి ఉబ్బరం, మూత్ర సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది.
అరటి పువ్వు పేగుల ఆరోగ్యానికి ఎతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అరటి పువ్వులలో ఉండే ఫినోలిక్ ఆమ్లాలు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ నష్టాన్ని నివారించి.. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అరటి పువ్వులో ఐరన్ ఎక్కువగా ఉండడంతో రక్తహీనతను తగ్గిస్తుంది. తరచుగా అరటి పువ్వుని తినడం వలన ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది