Jyothi Gadda

ఈ తెల్లటి గింజలు పోషకాలకు పవర్ హౌస్‌..! ఎన్ని లాభాలో తెలిస్తే..

03 March 2024

పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, వాటి ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం. 

పుచ్చకాయ గింజలు పోషకాలకు పవర్ హౌస్‌.  ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు A, B1, B6, C, E, మినరల్స్,  మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. 

ఫైబర్‌కు కూడా మంచి మూలం, ఇది మీ జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. పుచ్చకాయ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ నష్టం నుంచి కణాలను రక్షించడానికి సహాయపడతాయి. 

పుచ్చకాయ గింజల వినియోగంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో అధిక శాతం ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్  స్థాయిలను తగ్గించడానికి హపడతాయి. 

అంతేకాకుండా, విటమిన్ సి మరియు జింక్ వంటి ఖనిజాలు ఇతర అనారోగ్యాలనుంచి పోరాటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయ గింజల్లోని మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడానికి , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. పేగు లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగును పెంచుతుంది. 

పుచ్చకాయ గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్లమీ శరీరం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండానికి మీరు ఈ గింజలను మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు.