ప‌ర‌గ‌డుపున నీళ్లకు బదులుగా మజ్జిగ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

29 December 2023

TV9 Telugu

ఉదయం నిద్రలేవగానే మజ్జిగ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మజ్జిగలో ప్రొబయోటిక్‌ బ్యాక్టీరియా గుణాలు ఎక్కువగా ఉంటాయి.

 వేసవిలోనే కాకుండా ప్రతిరోజు మజ్జిగ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉదయాన్నే మజ్జిగ తాగటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

క‌డుపులో మంట‌, అల్స‌ర్, గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లను త‌గ్గించ‌డంలో మ‌జ్జిగ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.

అంతేకాకుండా మజ్జిగను పరగడుపున తీసుకోవడం వల్ల ప్రేగులు శుభ్రం ఉంటాయి. ఉదయం మజ్జిగను తీసుకోవడం కష్టం అనుకొనేవారు రాత్రి అన్నంలో కొంచెం మజ్జిగను తీసుకోవడం మేలు.  

కేవలం పెరుగులో నీళ్లు కలిపిన మజ్జిగ కాకుండా కొంచెం మిరియాల పొడి, కరివేపాకు, కోతిమీరా ఇతర ఆకులు కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గించడంలో మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

 బీపీ గుండె పోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఇలాంటి వారికి మజ్జిగ ఔషదంలా పనిచేస్తుంది. మజ్జిగ బీపీని త్వరగా కంట్రోల్ చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.

 బీపీ గుండె పోటుతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఇలాంటి వారికి మజ్జిగ ఔషదంలా పనిచేస్తుంది. మజ్జిగ బీపీని త్వరగా కంట్రోల్ చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.