దానిమ్మ ఆకులతో అంతులేని ఆరోగ్య లాభాలు.. తెలిస్తే..!
Jyothi Gadda
21 March 2024
దానిమ్మ పండే కాదు దాని ఆకుల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ ఆకులో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పుష్కలంగా ఉన్నాయి.
దానిమ్మ చెట్టు ఆకులు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దానిమ్మలో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ ఆకుల కషాయంతో సీజనల్ దగ్గు, జలుబు తగ్గించుకోవచ్చు.
దానిమ్మ ఆకులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్, ట్రిగ్లైసెరైడ్లను తగ్గించి, రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతాయి. కామెర్లు, అతిసారం, కడుపునొప్పి, నిద్రలేమి చికిత్సకు ఉపయోగిస్తారు.
దానిమ్మ ఆకుల రసాన్ని నోటిపూత నివారణకు ఉపయోగించవచ్చు. నిద్ర లేమి వారికి దివ్య ఔషధం.. దానిమ్మ ఆకుల పేస్ట్ తో చేసిన కాషాయం..రోజూ రాత్రి నిద్ర పోయేముందు తాగితే సుఖ నిద్రపడుతుంది.
ఆయుర్వేదంలో దానిమ్మ ఆకుని కుష్టు వ్యాధి, చర్మ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. గజ్జి, తామర వంటి స్కిన్ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. దానిమ్మ ఆకులను పేస్ట్‌గా చేసిన అప్లై చేస్తే నయం అవుతుంది.
దానిమ్మ ఆకులులో ఉన్న విటమిన్ సి, ఆంటియాక్సిడెంట్లు జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతాయి. దానిమ్మ ఆకులు జుట్టు ను బలంగా, చక్కని రంగులో ఉంచటంలో సహాయపడుతాయి.
చర్మాన్ని మెరిసే చేస్తాయి.
దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు క్యాన్సర్‌కు కారకమయ్యే కణాలను త్వరగా పెరగకుండా ఆపటంలో సహాయపడుతాయి. పలు రకాల క్యాన్సర్‌ల చికిత్సలో కూడా సహయపడతాయి.
నోటి సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిలో పుండ్లు ఉంటె, దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి పుక్కిలిస్తుండాలి. దీంతో నోటి సమస్యలు తగ్గిపోతాయి.