అనేక రకాల విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లను కలిగిన బొప్పాయి చర్మ సంరక్షణలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు, మచ్చలను తొలగించగలదు.
ఆరెంజ్ ఫ్రూట్‌లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు మొటిమలు, పులిపిర్లు, మచ్చలను తొలగించడమే కాక ముడతలను నివారిస్తుంది.
వాటర్ కంటెంట్ ఎక్కువగా కలిగిన పుచ్చకాయలో విటమిన్ సి, గ్లూటథియోన్, లైకోపిన్ పుష్కలంగా ఉన్నందున ఇది ముడదలను నివారించగలదు.
విటమిన్ ఎ, విటమిన్ సి, ఆంథొసియానిన్‌ని కలిగిన బ్లూబెర్రీలు చర్మ సమస్యలను నిరోధించగలవు. ఈ క్రమంలోనే మొటిమలు, మచ్చలు, ముడతలను కూడా నివారించగలవు.
మామిడి ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా మంచిది. మామిడిలోని విటమిన్ ఏ, కరోటినైడ్స్ చర్మంపై ముడతలను తొలగిస్తాయి.
దానిమ్మ కూడా చర్మంపై ముడతలను తొలగించగలదు. ఇందలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి సమస్యలను నివారిస్తాయి.
సాలిసైలిక్ ఆసిడ్‌ని కలిగిన స్ట్రాబెర్రీలు చర్మంపై వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
యాపిల్‌లో విటమిన్ ఎ, బి, సి ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్ నష్టాన్ని అరికట్టి, కొల్లాజెన్ ప్రోడక్షన్‌ని ప్రోత్సహిస్తాయి.
విటమిన్ ఎ, సి, కె లను కలిగిన పైనాపిల్ కూడా చర్మాన్ని మెరిసేలా చేయగలదు. అంతే కాక యాంటీఏజింగ్ ఏజెంట్‌గా పనిచేసి ముడతలను తగ్గించగలదు.