అర్థరైటీస్‌తో బాధపడే వారు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇవే.
మామిడి రుచిలోనే కాదు పోషకాల్లోనూ తోపు. ఇందులోని విటమిన్ సి, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు వాపును తగ్గించడంలో, ఎముకల నష్టం నుంచి కాపాడుతాయి.
కీళ్ల నొప్పులను నయం చేయడంలో స్ట్రాబెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతోన్న వారికి స్ట్రాబెర్రీలు ఎంతో ఉపయోగపడతాయి.
టార్ట్ చెర్రీస్ కూడా అర్థరైటిస్‌కు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్ ఆంథోసైనిన్ నుంచి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే రెడ్ రాస్ప్ బెర్రీస్ కూడా కీళ్ల నొప్పులకు బాగా పనిచేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్‌లు ఆస్టియో ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులకు పుచ్చకాయ బెస్ట్ మెడిసన్‌గా పని చేస్తుంది. ఇందులోని కెరోటినాయిడ్ బీటా-క్రిప్టోక్సాంటిన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ద్రాక్షలను నిత్యం డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎరుపు, నలుపు ద్రాక్షల్లో ఉండే రెస్వెరాట్రాల్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
దానిమ్మ కూడా కీళ్ల నొప్పులకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పండులోని పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, నొప్పిని తగ్గిస్తాయి.