15 September 2023

ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలని ఎవరు కోరుకోరు..! అయితే ఇది మీకోసమే..

ఆరోగ్యంగా, ఎక్కువ కాలం పాటు జీవించాలి. ఇలా ఎక్కువ మంది కోరుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 

బ్లూజోన్ ప్రాంతవాసుల ఆయుర్దాయం వందేళ్లు. ఇటలీ, జపాన్‌, గ్రీస్‌ దేశాల వారి జీవన విధానంలో కొన్ని ఆసక్తికరమైన అలవాట్లను  పరిశోధకులు గమనించారు

ఆహారం, వ్యాయామంతో సంబంధం లేకుండా ఒత్తిడి లేకుండా హాయిగా జీవించడమే వారి ఆరోగ్య రహస్యం అని తెలుసుకున్నారు 

 కాస్త క్రమశిక్షణతో వీటిని రోజువారీ జీవనంలో మీరు కూడా భాగం చేసుకుంటే చాలు. కొంచెం కష్టమే అయినా సంక్పలం ఉంటే వీటిని సాధించడం కష్టమేమీ కాదు. 

సమతులాహారం,  వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. మంచి ఆరోగ్యానికి ఇవి రెండూ ముఖ్యమే.

దీర్ఘకాలం పాటు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మన శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెరిగిపోతుంది. సంతోషంగా ఉండాలని భావించే వారు ముందుగా ఒత్తిడిని జయించాలి.

సామాజికంగా చురుగ్గా ఉండడం అవసరం.  కుటుంబ సభ్యులైనా స్నేహితులతో అయినా మంచి సంబంధాలు కలిగి ఉండడం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇష్టమైన వారితో సమయం గడపాలి. 

 ఒకవైపు ఎంత పని భారం ఉన్నప్పటికీ, జీవితానికి సంతోషాన్నిచ్చేవి ఆచరించాలి. మీకు సంతోషాన్ని కలిగించే వాటి కోసం ఎంత ఖర్చు చేసినా అది పెట్టుబడే అవుతుంది.