యాపిల్.. రంగు మారుతోందా.!
14 August 2023
Pic credit - Pexels
యాపిల్ పండును కట్ చేశాక వెంటనే తినేయాలి. లేదంటే యాపిల్ ముక్కలు ఎరుపు రంగులోకి మారిపోతాయి
ఇలా ఎందుకు జరుగుతుందా..? అనే అనుమానం చాలా మందికి ఉంది. నిజానికి దీని వెనుక ఓ సైన్స్ రహస్యం ఉంది
యాపిల్‌లోపల ఉండే గుజ్జులోని పాలీఫినోల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్ కలర్‌లోకి మారుస్తుంది
యాపిల్ ముక్కలు రంగు మారకుండా అలాగే ఉండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరి..
యాపిల్ ముక్కలు కట్ చేశాక.. యాపిల్ ముక్కలపై నిమ్మరసం చుక్కలు చల్లితే దానిలోని సిట్రికామ్లం యాపిల్ ముక్కలు రంగుమారనీదు
అలాగే.. కప్పు నీటిలో టేబుల్‌స్పూన్ నిమ్మరసం వేసి ఆ మిశ్రమంలో యాపిల్ ముక్కల్ని 5 నిమిషాల పాటు ఉంచినా రంగు మారదు
నిమ్మరసానికి బదులుగా పైనాపిల్ జ్యూస్‌ను ఉపయోగించినా యాపిల్ ముక్కలు తాజాగా ఉంటాయి
కప్పు నీళ్లలో, రెండు టేబుల్‌స్పూన్ల తేనె వేసి ఈ నీటిలో కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసి కొన్ని నిమిషాలు ఉంచితే యాపిల్ ముక్కలు తాజాగా ఉంటాయి.
యాపిల్ ముక్కలను ఐస్ నీళ్లలో కొన్ని నిమిషాల ఉంచినా రంగు మారకుండా కొన్ని గంటల వరకూ తాజాగా ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చేయండి