వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏమవుతుందో తెలుసా..?
వర్షాకాలంలో ఆకుకూరలను తినకూడదనేది ఒక తప్పుడు వాదన.
ఈ కాలంలో దెబ్బతిన్న, పురుగులు తిన్న ఆకులను కూరకు ఉపయోగించొద్దు.
తాజా ఆకులను మాత్రమే ఎంచుకోవాలి. ఆకులను ఉడకబెట్టే ముందు బాగా కడగాలి.
ఆ తర్వాత ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో ఆకులు వేయాలి.
ఆకులను నీటిలో రెండు మూడు నిమిషాలు మరిగించాలి.
ఆ తర్వాత వాటిని వడకట్టి నేరుగా చల్లటి నీటిలోకి వేయాలి.
ఏవైనా టాక్సిన్స్ ఉంటే పోయి.. పోషకాలు కోల్పోకుండా ఉండటానికి,
ఆకులు, కూరగాయలు తాజాగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఇక ఇప్పుడు వండుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి..