పుట్టగొడుగుల కర్రీని ఇలా చేస్తే చికెన్ కర్రీ కూడా సరిపోదు!

Prasanna Yadla

28 January 2026

Pic credit - Pixabay

పుట్టగొడుగులు కొందరు పక్కన పెట్టేస్తారు. కానీ, ఇది మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ఎందుకంటే, దీనిలో విటిమిన్ డి ఎక్కువగా ఉంటుంది. 

పుట్టగొడుగుల కర్రీ

వెజ్ లవర్స్ కి ఇది చికెన్ తో సమానం. ఇవి మనకీ సహజంగానే దొరుకుతాయి. కాకపోతే ఇటీవలే కాలంలో ఇది కూడా వ్యాపారంగా అయిపోయింది. ఈ పుట్టగొడుగులతో రక రకాల వంటలు చేసుకుని తినొచ్చు.

ఇది చికెన్ తో సమానం

అయితే, ఈ పుట్టగొడుగుల కర్రీని ఇలా చేసుకుని తింటే ఏ కూరలు కూడా సరిపోవు. అయితే, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

చికెన్ కర్రీతో పోటీ

250 గ్రాములు పుట్టగొడుగులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో,  నూనె, ఉప్పు,  పసుపు,  కారం, పచ్చిమిర్చి ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్  ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్,  ఒక టీస్పూన్ యాలకులు, దాల్చిన చెక్క పొడి, చిన్న ముక్కలు లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర. 

కావాల్సిన పదార్ధాలు

ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి అది బాగా వేడయ్యాక జీలకర్ర , లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు వేసి బాగా వేయించాలి. 

స్టెప్ -1

ఆ తర్వాత  ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత  అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా  వేయించాలి. 

స్టెప్ -2

ఈ మిశ్రమంలో కొద్దిగా మసాలా పేస్ట్‌ను వేసి మీడియం మంట మీద పెట్టి  వేయించాలి. ఆ తర్వాత రుచికి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిసిపోయే వరకు తిప్పుకోవాలి.  

స్టెప్ -3

ఈ మిశ్రమంలో కొద్దిగా మసాలా పేస్ట్‌ను వేసి మీడియం మంట మీద పెట్టి  వేయించాలి. ఆ తర్వాత రుచికి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిసిపోయే వరకు తిప్పుకోవాలి.  

స్టెప్ -3

ఇప్పుడు పుట్టగొడుగుల ముక్కలు తీసుకుని వేయించాలి. దానిలో పచ్చిమిర్చి, కరివేపాకును వేసి కలపాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే దానిలో నీళ్లు పోసి, ఉప్పు వేసి రుచి చూసుకోవాలి.  

స్టెప్ -4

ఇక మూత పెట్టి 15 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. మీరు తినేబట్టి గ్రేవీని చూసుకుని చివర్లో  కొత్తిమీర వేసుకుని దించేయాలి. అంతే వేడి వేడి పుట్టగొడుగుల కర్రీ రెడీ

స్టెప్ -5