మద్యం తాగేటప్పుడు ఈ పదార్థాలు తింటున్నారా.? అయితే జాగ్రత్త!
23 Febraury 2024
మద్యం తీసుకొనేవారు ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల గ్యాస్, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం, గుండెలో మంట వంటి ఇతర సమస్యలు కలుగుతాయి. మద్యంతో పాటు తింటే అనారోగ్య సమస్యలు కలిగించే ఆహార పదార్థలేవో తెలుసుకుందాం..
మద్యం తాగేటప్పుడు తినకూడని ఆహారాల్లో చాక్లెట్ కూడా ఉంది. చాక్లెట్‌లో ఉండే టైరామైన్ అనే పదార్థం ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే మైగ్రేన్, వికారం, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది.
మద్యం తాగుతున్న వారు మందు మధ్యలో స్టఫ్‌గా పిజ్జా కూడా తినకూడదట. పిజ్జాలో ఉండే కొవ్వు పదార్థాలు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మద్యంలోకి స్టఫ్‌గా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌లో అధిక ఉప్పు, కొవ్వు ఉంటుంది. ఆల్కహాల్‌తో కలిసి తీసుకోవటం వల్ల బాధితుల్లో రక్తపోటు పెరగడానికి దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరు మందు తాగుతున్న క్రమంలో కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఉండే ఊరగాయ తింటుంటారు. అయితే, ఇది కూడా హనికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఊరగాయలో ఉండే ఎక్కువ ఉప్పు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే నిర్జలీకరణకు దారితీస్తుంది.
మద్యంలోకి స్టఫ్‌గా తినే పదార్థాల్లో కెఫిన్ కూడా హనికరం. కెఫిన్ ఉన్న పానీయాలు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. దాంతో వారిలో ఒకరకమైన ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తుంది.
మందుబాబులు ఆల్కహల్ తీసుకుంటూ స్టఫ్‌గా బీన్స్, కాయధాన్యాలు వంటివి కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. బీన్స్, కాయధాన్యాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మద్యంతో పాటు తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
పాల ఉత్పత్తులు కూడా మద్యంలోకి స్టఫ్‌గా తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యంలోకి స్టఫ్‌గా పాల ఉత్పత్తులు ఆల్కహాల్‌తో కలిసి తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తాయి.