రాత్రి ఈ ఫుడ్ తింటే చాలా డేంజర్‌.. 

03 September 2023

నిద్రపోయే ముందు హెవీ ఫుడ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. జీర్ణం కావడానికి ఎక్కువ సయం పట్టే ఫుడ్‌ వల్ల రాత్రి నిద్ర డిస్ట్రబ్‌ అవుతుంది. 

రాత్రి సమయయాల్లో ఎట్టి పరిస్థితుల్లో టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌, సోడాలో అధికంగా కెఫిన్‌ ఉంటుంది. ఇవి నిద్రకు భంగం కలుగుతుంది. 

కెఫిన్‌ తీసుకోవడం వల్ల కడపులో యాసిడ్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 

రాత్రి నిద్రపోయే సమయంలో స్వీట్స్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. స్వీట్స్‌ వల్ల రక్తంలో చక్కర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. 

పడుకునే ముందు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోడదు. ఇలాంటి ఆహారం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. 

ఇక కడుపులో యాసిడ్‌కు కారణమయ్యే మరో ఆహార పదార్థం సిట్రస్‌ జాతికి చెందిన పండ్లు. వీటితో పాటు టమాటో, ఉల్లిపాయలు వంటివి తీసుకోకూడదు. 

రాత్రిపూట పడుకునే ముందు అధికంగా నీరు ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ముఖ్యంగా పుచ్చకాయ, కీరాలాంటివి అవైడ్‌ చేయాలి. వీటివల్ల నిద్రకు భంగం కలుగుతుంది. 

రాత్రిపూట బంగాళదుంపలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.