మీ పిల్లలకు ఈ ఫుడ్ పెడుతున్నారా? చాలా డేంజర్‌ 

24 August 2023

బ్రెడ్‌లు, కేక్‌లు, పేస్ట్రీలు వంటివి చిన్నారులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. వీటిలో విపరీతమైన చక్కెరలు, కేలరీలు ఉంటాయి. అయితే ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు. 

కొందరి చిన్నారులకు న్యూడుల్స్‌ వంటి కూడా ఇస్తుంటారు. అయితే వీటిలో ఉండే సోడియం చిన్నారుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని చేస్తే కెమికల్స్‌ ఇందులో ఉంటాయి. 

ఇటీవల చిన్నారులకు చిప్స్‌ ఎక్కువ ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చిప్స్‌ వల్ల చిన్నారుల్లో అసిడిటి వంటి సమస్యలు వేధిస్తాయి. 

కొందరు తెలిసో, తెలియకో చిన్నారులకు కూల్‌ డ్రింక్స్‌ ఇస్తుంటారు. అయితే వీటివల్ల చిన్నారుల ఆరోగ్యాన్ని మనమే పాడు చేసినట్లు అవుతుంది. వీటివల్ల షుగర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. 

బేకరీ ఆహారాలను చిన్నారులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ముఖ్యంగా బర్గర్లు, పిజ్జాలు వంటివి పొరపాటున కూడా చిన్నారులకు అలవాటు చేయకూడదు. వీటివల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 

చిన్నారులకు కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థలను ఎక్కువగా ఇవ్వకూడదు. వీటివల్ల జీర్ణ క్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. వారిలో అసిడిటీ వంటి సమస్యలకు దారి తీస్తాయి. 

ఇక చిన్నారులకు త్వరగా జీర్ణంకానీ మాంసాహారాన్ని కూడా ఎక్కువగా ఇవ్వకూడదు. వారి జీర్ణ క్రియ వ్యవస్థ పెద్దలతో పోల్చితే తక్కువ క్రీయాశీలకంగా పని చేస్తుంది. కాబట్టి ఇలాంటివి ఇవ్వకూడదు. 

ఇక కొంత మంది చిన్నారులకు కూడా టీ, కాఫీలను అలవాటు చేస్తుంటారు. వీటిని కూడా ఇవ్వకూడదు. ఇలాంటి వాటి వల్ల చిన్నారుల్లో జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వస్తాయి.