బెండకాయను వీటితో కలిపి తింటే.. మీ కిడ్నీలు షెడ్డుకే

24 December 2024

Ravi Kiran

బెండకాయ్ జిగురుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. 

ఈ బెండకాయ్‌లో విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నిషియం, విటమిన్ బి, మాంగనీస్ వంటి పోషకాలు, అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది

బెండకాయలు తినడం వల్ల ఎముకలు బలంగా మారడమే కాదు.. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే బెండకాయ్‌తో కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదు. 

బెండకాయ తిన్న తర్వాత పాలు అస్సలు తాగకూడదు. రెండింటిలోనూ కాల్షియం ఉంటుంది. రెండూ తినడం వల్ల ఆక్సలేట్‌ ఏర్పడుతుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి

కాకరకాయ, బెండకాయ కలిపి తినకూడదు. జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు వీటిని కలిపి తినొద్దు. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, డయేరియా, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

 బెండకాయ తిని ఉంటే.. వెంటనే టీ జోలికి వెళ్లకండి. ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. బెండకాయ తిన్న తర్వాత టీ తాగితే మన శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. 

ముల్లంగిని బెండకాయతో కలిపి తినొద్దు. గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి. కడుపు నొప్పి, వాంతులు, పుల్లటి తేన్పులు, ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి.

బెండకాయ, రెడ్ మీట్ రెండూ కలిపి తినకూడదు. ఇవి రెండూ కలిపి తింటే జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం పడుతుంది.  కడుపులో చికాకుతో పాటు అనేక జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.