చికెన్ ఇష్టంగా కుమ్మేస్తున్నారా? వీటితో కలిపి తిన్నారంటే బాడీ షెడ్డుకేనట.!
28 January 2025
Ravi Kiran
మంసాహార ప్రియుల్లో చికెన్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చికెన్‌తో ఎన్నో రకాల రుచికరమైన వంటలను తయారు చేస్తారు.
చికెన్ తినాలనుకుంటే మంచిదే.. కానీ.! కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదన్న విషయం తెలుసా.? అలా తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందంటున్నారు వైద్య నిపుణులు
శరీరంలో అలెర్జీ, ప్రతిచర్యకు కారణమవుతుంది. ఇంకా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు. చికెన్‌తో ఏయే పదార్థాలు తింటే హానికరమో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలతో చికెన్ తినడం అస్సలు మంచిది కాదట. పాలు, చికెన్ కలిపి తింటే చర్మ సమస్యలు పెరుగుతాయి. దద్దుర్లు, తెల్లమచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి.
చికెన్, పెరుగు కలిపి తినడం జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. చికెన్, పెరుగు కలిపి తినడం సాధ్యమైనంత వరకు మానుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
చికెన్‌తో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్, చేపలు రెండింటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ వివిధ రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి.
ఈ ప్రోటీన్ శరీరంపై ప్రతిచర్యకు కారణమవుతుంది. దీని వల్ల అలెర్జీ లాంటి సమస్యలతోపాటు శరీరానికి హాని కలుగుతుంది. కావున చికెన్, చేపలను కలిపి తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.