షుగర్ ఉన్నవారు స్మూదీలను దూరం పెడుతున్నారా..? డాక్టర్స్ ఏం చెప్తున్నారు..!
షుగర్ బాధితులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
షుగర్ ఉన్నవారు స్మూదీలను దూరం పెడుతుంటారు, అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయనే అపోహలో ఉంటారు.
స్మూదీలు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచడానికి తోడ్పడతాయి. మీరు చేయాల్సిందల్లా డయాబెటిస్-ఫ్రెండ్లీ స్మూతీస్ తీసుకోవడమే.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకోండి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బొప్పాయి, పీచెస్, యాపిల్స్, చెర్రీస్ బలాన్నిస్తాయి
పాలకూర, దోసకాయ, బీట్‌రూట్, క్యారెట్ వంటి కూరగాయలను మీ స్మూతీస్‌లో యాడ్ చేసుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఇంకా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
స్మూదీస్‌లో పెరుగు, తక్కువ కొవ్వున్న పాలు, బాదం పాలు, సోయా పాలు, ఓట్ పాలు యాడ్ చేసుకుంటే ప్రొటీన్‌తొ మరింత హెల్తీగా తయారవుతుంది.
బాదం, చియా గింజలు, అవిసె గింజలు, అవకాడో వంటి మంచి కొవ్వులను స్మూదీలలో యాడ్ చేస్తే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో మెండుగా లభిస్తాయి.
ఆపిల్, ఖర్జూరం స్మూదీ, బొప్పాయి, అరటిపండు స్మూదీలలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫోలేట్ పోషకాలు నిండి ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్పైక్‌నీ తగ్గిస్తాయి.