చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
TV9 Telugu
01 February 2024
చికెన్, మటన్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది. నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే నోట్లో నీళ్లు వస్తాయి. మ్యుఖ్యంగా చికెన్ లవర్స్ ఎక్కువగా ఉంటారు.
చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గ్రేవీ, చికెన్ మంచూరియా, చికెన్ కబాబ్స్, చికెన్ 65 ఇలా చికెన్ తో తయారు చేసే ప్రతీ చాలా ఇష్టంగా తింటారు.
చికెన్, మటన్ మాత్రమే కాదు దాంట్లో సెపెరేట్ పార్ట్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. లివర్, బ్రెయిన్, బోన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఉంటుంది.
చికెన్ లివర్ పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహారాల్లో ఒకటి. దీనిలో ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ B12, విటమిన్ A, కాపర్, ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి, చర్మ, రక్త హీనత సమస్యలను తగ్గిస్తాయి.
చికెన్ లివర్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఐరన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం ద్వారా రక్త కణాలను పెంచుతుంది. రక్త హీనత తగ్గించడానికి సహాయపడుతుంది.
చికెన్ లివర్ లో విటమిన్ K అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మ్యుఖ్యం. విటమిన్ K క్యాల్షియం శోషణను పెంచి.. ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది.
మీ డైట్‌లో చికెన్ లివర్ తీసుకుంటే.. విటమిన్ K లోపం కారణంగా వచ్చే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చికెన్ లివర్ విటమిన్ B12 ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థకు తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తి, నిరాశ, అయోమయం, చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి లివర్ బెస్ట్ ఆప్షన్.