ఖర్బూజ గింజలే కదా పడేస్తే.. ఇవన్నీ మిస్సయినట్లే..

Jyothi Gadda

28 March 2024

ఎండకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఖర్జూజా అందుబాటులో ఉంటాయి. ఈ సమ్మర్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనల్ని రోజంతా హైడ్రేటేడ్‌గా ఉంచుతుంది. అయితే, వీటి గింజల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.

ఖర్జూజా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తాయి. ఫైబర్ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు దరిచేరవు. ఇది పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

ఖర్జూజా గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, విటమిన్ ఏ, సీ, ఇ పుష్కలంగా ఉంటాయి. ఐరన్, మెగ్నిషియం, పొటాషియం అనే ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

ఖర్జూజా గింజల్లో కావాల్సినంత ఖనిజాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నిషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి మన ఎముక ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా పంటి ఆరోగ్యానికి కూడా మంచివి. 

ఖర్జూజా గింజల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్‌, ఓమేగా 3, ఓమేగా 6 యాసిడ్స్ ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూజా గింజలు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తాయి.

ఖర్జూజా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ, ఫ్లేవనాయిడ్స్, కెరొటోనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురికాకుండా కాపాడతాయి. 

సాధారణంగా ఖర్జూజా గింజల్లో కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. భోజనం తర్వాత ఇతర చిరుతుళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. 

గట్‌ హెల్త్‌ను ఖర్జూజా గింజలు ఎంతో మెరుగుపరుస్తాయి. ఈ ఖర్జూజా గింజలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.