చిటికెడు నెయ్యితో పుట్టెడు లాభాలు!

Samatha

20 August  2025

Credit: Instagram

ఆయుర్వేద శాస్త్రం నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. కొంత మంది నెయ్యి తినడానికి ఇష్టపడరు. కానీ ఇది హెల్త్‌కు చాలా మంచిదంట.

అంతేకాకుండా నెయ్యి శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే ఇది పోషకాల గని, దీనిని ప్రతి రోజూ మీ డైట్‌లో చేర్చుకోవడం ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవంట.

ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అలాగే ఇందులో ఉండే ఆరోగ్యకర కొవ్వులు గెండె ఆరోగ్యానికి చాలా మంచిదంట.

నెయ్యిని ప్రతి రోజూ మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సహాయపడుతుందంట.

అదే విధంగా నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుందంట. అందువల్ల దీనిని తీసుకోవడం వలన శరీరంలో వ్యాధులతో పోరాడే టీ కణాలను ఉత్పత్తి చేయడానికి ఈ నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది.

నెయ్యిని తీసుకోవడం వలన ఇది చర్మసమస్యల నుంచి ఉపశమనం కలిగించి. చర్మాన్ని ఎప్పుడూ నిగారింపుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నెయ్యిలో విటమిన్ కె, కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని పెంచి, ఎముకలలో బలాన్ని పెంచుతుంది. అందువలన ఎముకల ధృఢత్వానికి నెయ్యి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందంట.

అందువలన ప్రతి రోజూ మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం చాలా మంచిది, దీని వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు.