కమ్మటి కాఫీతో.. గుట్ట కూడా ఇట్టే కరగాల్సిందే

26 October 2024

Ravi Kiran

కాఫీలో కెఫిన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. కెఫిన్ అనేది జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడే సహజ ఉద్దీపన. 

కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచడానికి, కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది.

కాఫీ తాగడం వల్ల శరీరంలో థర్మోజెనిసిస్ తాత్కాలికంగా పెరుగుతుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే ప్రక్రియగా పనిచేస్తుంది. 

కాఫీలోని కెఫిన్ వ్యాయామం చేసే సమయంలో శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది. 

రెగ్యులర్ కాఫీ వినియోగం ఇన్సులిన్, లెప్టిన్ వంటి జీవక్రియ హార్మోన్ల సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తుంది. 

కాఫీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్‌ పని తీరును మెరుగుపరిచి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

తీయని కాఫీ తాగడం వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలోని కెఫిన్ మన మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. 

కాఫీ సువాసన, దాని రుచి మన మనస్సు శ్రేయస్సుకు సహాయపడుతుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగేవారు ఎక్కువకాలం జీవిస్తారని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

కాఫీ అలవాటు డిప్రెషన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అయితే, కాఫీని మితంగా తాగితేనే మంచిది. అతిగా తాగటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.