నిమ్మ రసం తాగుతున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..
18 March 2024
Jyothi Gadda
లెమన్ వాటర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగుతుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. బరువును నియంత్రించటంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.
అయితే, నిమ్మకాయ నీరు అధికంగా తాగితే సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా? బరువు తగ్గడానికి లెమన్ వాటర్ మోతాదుకు మించి విచక్షణారహితంగా తాగుతున్నవారు దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.
నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఎందుకంటే ఇది ప్రోటీన్ విడగొట్టే ఎంజైమ్ అయిన పెప్సిన్‌ని సక్రియం చేస్తుంది. ఎక్కువగా తీసుకోవటం వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుంది. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.
లెమన్ వాటర్ అతిగా తాగడం వల్ల డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఏర్పడుతుంది. మూత్రం అధికంగా వస్తుంది. శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. ఈ క్రమంలో శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి.
నిమ్మ రసం తరుచూ తాగుతుంటే అధిక మొత్తంలో విటమిన్ సీ రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నిమ్మకాయ నీరు ఎక్కువగా తాగితే పొటాషియం లోపం ఏర్పడుతుంది.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీంతో పాటుగా తగినంత మొత్తంలో ఆక్సలేట్ కూడా ఉంటుంది. నిమ్మకాయ నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల అవన్నీ శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలో ఉండే ఎసిడిటీ కారణంగా, పదే పదే లెమన్ వాటర్ తాగినప్పుడు ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగరాదు. ఎందుకంటే అలా చేయడం వల్ల హానికలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రీసెర్చ్ ప్రకారం, నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటే, అది గొంతు నొప్పికి కారణమవుతుంది.