17 August 2023
సినీతారల నుండి సెలబ్రిటీస్ వరకు తాగే బ్లాక్ వాటర్ గురించి తెలుసా.?
సినీ తారల సీక్రెట్ బ్లాక్ వాటర్..! ఈ బ్లాక్ వాటర్ యొక్క ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
తెల్లటి, స్వచ్ఛమైన నీటినే మనం ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటి స్వచ్ఛమైన నీటికోసం డబ్బు ఖర్చుపెట్టి మార్కెట్‌లో కొనుగోలు చేస్తారు
కానీ, ఇక్కడ మాత్రం నల్లగా, కషాయం కంటే దారుణంగా కనిపిస్తున్న ఈ బ్లాక్ వాటర్‌ని సినీ, క్రీడా ప్రముఖులు కొందరు ఎగబడి తాగుతున్నారట.
ఎందుకంటే ఇలాంటి బ్లాక్ వాటర్‌లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం
బ్లాక్ వాటర్ ప్రయోజనాలు సాధారణ మనం తాగే మంచినీళ్లలో ph స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట.
అలానే బాడీని హైడ్రేటెడ్, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు ఉంటాయి
శరీరానికి సరిపడా ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలను నివారిస్తుంది.
బ్లాక్ వాటర్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా చేస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ , మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఈ బ్లాక్ వాటర్ సహాయపడుతుంది.
ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఈ బ్లాక్ వాటర్
కీళ్లలో జిగురు పెంచడంలోనూ శరీర కీలకమైన విధుల్లో పాల్గొంటుంది. జీవక్రియ, నాడీ సంబంధిత విధులను మారుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి