మనలో చాలా మంది ఒక్క నిమిషం కూడా మొబైల్‌ను విడిచిపెట్టి ఉండలేరు. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ముందుగా మొబైల్ చూడడం అలవాటుగా మారిపోయింది
ఫోన్ వాడకం వ్యసనంగా మారడంతో చాలా మంది అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఆరోగ్య నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఫలితం లేకుండా పోతోంది
కొందరు టాయ్‌లెట్‌కి తీసుకెళ్లినా తమ వెంట మొబైల్ తీసుకెళ్తున్నారు. చాలా మంది భోజనం చేసేటప్పుడు కూడా పదేపదే మొబైల్ చూడడం లేదా సోషల్ మీడియాలో గడపడం చేస్తుంటారు
వర్క్ టైమ్‌లో మొబైల్ చూసే అవకాశం లేదనందున భోజనం చేసే టైమ్‌లో సోషల్ మీడియాలో లాగిన్ అవుతున్నట్లు కొందరు తమ అలవాటును సమర్థించుకుంటున్నారు.
ఆహారం తినకుండా పిల్లలు మారం చేస్తే వారికి మొబైల్ చూపిస్తూ తినిపించే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఇదేదో మంచి ట్రిక్ అనే భ్రమల్లో వారు ఉంటున్నారు
మొబైల్ చూస్తూ ఆహారం తిన్నా.. పిల్లలకు తినిపించినా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని వైద్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు
మొబైల్ చూస్తూ ఆహారం తింటే.. కడపు నిండిందో లేదో గుర్తించలేము. తద్వారా మనం అవసరానికి మించి ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశముంది.
తద్వారా పిల్లలు, పెద్దల్లో ఊబకాయం సమస్య రావొచ్చు.ఊబకాయం సమస్యతో డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు చుట్టిముట్టే ప్రమాదముంది.
ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడొద్దంటే భోజనం చేసే సమయంలో మొబైల్ ఫోన్ దూరంగా పెట్టాలి.. ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి.