వంటకం పూర్తయ్యాక అలంకారానికి డ్రై ఫ్రూట్స్‌తో ముచ్చటైన డిజైన్లను సృష్టించవచ్చు. అవి ఎలాగో ఇప్పుడు చుడండి.
చూడగానే ఇదేమైనా పెయింటింగా అనిపించేంత చక్కగా తీర్చిదిద్దవచ్చు. ఇదే ఈ గార్నిషింగ్ కళలోని ప్రత్యేకత.
ఈ తరహా టెక్నిక్‌తో ఫుడ్ డెకరేషన్ కోసం ప్రత్యేక రంగులు వాడక్కర్లేదు. ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు కలపనవసరం లేదు.
గుమ్మడి, పొద్దుతిరుడుగు గింజలు, డ్రైఫ్రూట్స్, పండ్లతో కాకుండా తాజా లేదా ఎండిన గులాబీ రేకుల్నీ వాడి గార్నిష్ చేయవచ్చు.
మనం ఏ పదార్థం మీద అలంకరణ చేస్తున్నాం, దానికి ఏ రంగులు, ఎలాంటి డిజైన్లు బాగుంటాయి అనే ఆలోచన ఉంటే చాలు.
మీకు డిజైన్లు తోచకపోతే, సింపుల్ డిజైన్ల నుంచి చేయితిరిగిన చిత్రకారుడు కుంచెతో మలిచాడా అనిపించేలాంటి భారీ డిజైన్ల దాకా బోలెడు రకాలు నెట్‌లో దొరుకుతాయి.
మొత్తానికి పదార్థాన్ని తిని వారెవ్వా అనడం కాదు, చూడగానే అదిరింది అనే కితాబు అందుకోవాలంటే గార్నిషింగ్ ట్రై చేసి చూడండి.