02 January 2024
TV9 Telugu
ఫ్రూట్ స్మూతీస్ ఆరోగ్యకరమైనవిగా అనిపిస్తాయి. అయితే ఇది షుగర్ లెవెల్స్ ను వెంటనే పెంచుతాయి. అందువల్ల ఫ్రూట్ స్మూతీస్ డయాబెటిక్ రోగులకు హానిని కలిగిస్తాయి
డోనట్స్, షుగర్ పేస్ట్రీలు రుచిగా ఉంటాయి. అయితే వీటిల్లో చక్కెర స్థాయిని వెంటనే పెంచే గుణం ఉంది. కనుక వీటిని అల్పాహారంలో తినకూడదు.
చాలా మంది ప్రజలు అల్పాహారంలో చక్కెరతో కూడిన తృణధాన్యాలు తినడానికి ఇష్టపడతారు. కానీ డయాబెటిక్ రోగులు దీనిని తినకూడదు. ఎందుకంటే షుగర్ లెవెల్ వేగంగా పెరుగుతుంది.
చాలామంది పల్చటి గడ్డ పెరుగుని లేదా యోగర్ట్ ను తినే ఆహారంలో చేరుకుంటారు. యోగర్ట్ తయారీలో అదనపు టెస్ట్ కోసం చక్కెరను ఉపయోగిస్తారు. కనుక మధుమేహ రోగులు యోగర్ట్ ను అల్పాహారంలో చేర్చుకోరాదు.
ప్రజలు కూడా అల్పాహారంలో తాజా పండ్ల రసం త్రాగడానికి ఇష్టపడతారు. తాజా పండ్ల రసం మీ చక్కెరను వేగంగా పెంచుతుంది. కాబట్టి పండ్ల రసానికి బదులుగా తాజా పండ్లను తినండి.
పాన్‌కేక్‌లు చాలా తీపిని కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచడానికి కారణమవుతుంది. కనుక ఉదయమే అల్పాహారంగా దీన్ని తినే పదార్ధాలలో చేర్చుకోరాదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్ , విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. కనుక గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినండి.