ముంబయిలోని బాంద్రాకు చెందిన ఓ రెస్టారెంట్‌కు ఆదివారం రాత్రి అనురాగ్ సింగ్ అనే వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి వెళ్లాడు
ఇద్దరూ చికెన్ కూర, మటన్ థాలీని ఆర్డర్ చేశారు. భోజనం చేస్తుండగా చికెన్ కర్రీ రుచి వేరుగా ఉండటాన్ని గమనించారు.
టేబుల్‌పై ఉన్న కర్రీని నిశితంగా పరిశీలించగా దానిలో చచ్చిన ఎలుకను గుర్తించారు. దీంతో అనురాగ్ సింగ్ చికెన్ కర్రీని, అందులో నుంచి బయటికి తీసిన ఎలుక అవశేషాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
సదరు రెస్టారెంట్ యాజమన్యంపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై వారు హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు పోలీసులకు తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా రెస్టారెంట్ మేనేజర్ వివియన్ ఆల్బర్ట్ షికావర్, ఆ సమయంలో హోటల్‌లోని చెఫ్, చికెన్ సప్లయర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వారికి సప్లయ్ చేసిన ఆహారాన్ని పరీక్ష నిమిత్తం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన పోలీసులు మేనేజర్, కుక్‌ను అరెస్టు చేశారు
ఐతే ఈ ఆరోపణలను సదరు రెస్టారెంట్ తోసిపుచ్చింది..తాము 22 ఏళ్లుగా హోటల్ నడుపుతున్నామని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని తెల్పింది
వారు తప్పతాగి తమ రెస్టారెంట్‌కు వచ్చారని, తమ సిబ్బందితో గొడపడ్డారని, తమ నుంచి డబ్బు కాజేయాలనే ఉద్దేశ్యంతోనే వాళ్లు ఈ ఆరోపణలు చేస్తున్నారని హోటల్ మేనేజర్ తెలిపాడు