ఖాళీ కడుపుతో సోంపు గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు

Jyothi Gadda

26 March 2024

సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే దీన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉదయం పూట సోంపు గింజలను తప్పకుండా తీసుకోండి. 

సోంపులో విటమిన్ సి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సోంపు గింజలు తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది మీ మెుత్తం ఆరోగ్యానికి శ్రేయస్కరం

చాలా మంది ఎముకల సమస్యలతో బాధపడుతారు. ఇవి బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం. ఎముకలలో కాల్షియం ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధిని దూరం చేస్తుంది.

సోంపులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం కొరతను కలిగించదు. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది. సోంపు తీసుకోవడం వలన మీ శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. మెుత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

సోంపు గింజలు సాధారణంగా సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఇది బరువు పెరగడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో మీరు తెలుసుకోవాలి.

మీరు పొట్ట కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే వడగట్టి తాగాలి. దీంతో శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది

కొందరికి తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. తీపి కోరికలను నియంత్రించడం కష్టం కాబట్టి మీరు బదులుగా వేయించిన సోంపు గింజలను తినవచ్చు. ఇది ఆరోగ్యంగా, తీపిగా ఉండటానికి మీరు దీనికి బెల్లం కలుపకోవచ్చు.

సోంపు గింజలను తినడం ఇష్టంలేనివారు.. దీనిని టీ రూపంలో తీసుకోవచ్చు. బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. ఈ టీతో జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. దీని కోసం మీరు ఒక కప్పు నీటిలో ఒక చిటికెడు సోంపుని మరిగించి తాగాలి.