బెండకాయతో కలిపి ఇవి తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్లే

Venkata Chari

06 Jul 2025

లేడీఫింగర్ అంటే బెండకాయను వెజిటేబుల్ చాలా రుచికరమైనది. దీనిని తినడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

మెగ్నీషియం, విటమిన్ కె, ఫోలేట్ వంటి అనేక పోషకాలు లేడీఫింగర్‌లో లభిస్తాయి. అందుకే తరచుగా బెండకాయను తినాలని చెబుతుంటారు.

కానీ, కొన్ని ఆహారాలను లేడీఫింగర్‌తో కలపడం విషంలా మారుతుందంట. అవేంటో తెలుసుకోకపోతే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.

బెండకాయతో కలిపి తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

లేడీఫింగర్‌తో పాలు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది. అందుకే బెండకాయను పాలతో కలిపి తీసుకోకూడదని చెబుతుంటారు.

ముల్లంగిని లేడీఫింగర్ తో కలిపి తినడం వల్ల పొట్ట ఆరోగ్యానికి హానికరం కావొచ్చు. అందుకే ఈ రెండింటి కాంబినేషన్‌తో వంటలు వండొద్దని చెబుతున్నారు.

లేడీఫింగర్‌తో మాంసం కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. మొత్తం గట్ హెల్త్ కరాబ్ అవుతుందన్నమాట.