ఈ బ్లడ్‌​ గ్రూప్‌ వాళ్లు చికెన్, మటన్‌ తింటే ఏం జరుగుతుందో తెలుసా..

March 31, 2024

TV9 Telugu

కొంత మందికి వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక ఆదివారం వస్తే మటన్‌ లేదంటే చికెన్‌ ఉండాల్సిందే. లేదంటే నాన్‌ వెజ్‌ ప్రియులు అల్లాడిపోతారు

నిజానికి మాంసాహారం కన్నా శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ రుచి విషయంలో నాన్‌వెజ్‌కే అధికమంది సై అంటారు. వైద్యులు మాత్రం బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి చికెన్‌ లేదా మటన్‌ తినాలంటున్నారు

మరీ ముఖ్యంగా కొన్ని బ్లడ్‌ గ్రూప్‌లకు చెందిన వారు ముక్క అస్సలు ముట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్‌ గ్రూప్‌ వాళ్లు ఏమేం తినొచ్చు, తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం

కొందరికి నాన్‌వెజ్‌ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు వెంటాడుతాయి బ్లడ్‌ గ్రూప్‌ని బట్టి నాన్‌వెజ్‌ను ఎంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు 

బ్లడ్‌ గ్రూప్‌లో ఓ, ఏ, బీ, ఏబీ.. అనే నాలుగు రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారి విషయానికొస్తే వీరిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువ. అందుకే వీరు మాంసాహారాన్ని సులభంగా జీర్ణించుకోలేరు 

చికెన్ లేదా మటన్ తక్కువగా.. సీఫుడ్ వంటి వాటితోపాటు పప్పులను ఆహారంలో చేర్చుకుని తినాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి

బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. వీరు చికెన్, మటన్ ఏదైనా హాయిగా తినొచ్చు. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్‌ల వ్యక్తులకు ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించాలి

జీర్ణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు నిపుణులు సూచిస్తున్నారు. కొందరికి ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలై.. ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి