వింటర్ లో లభించే సీజన్ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు.
చలికాలంలో లభించే నారింజ పండ్లను అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఇక వింటర్‌లో ప్రతీ రోజూ కచ్చితంగా ఒక ఆపిల్ పండును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆపిల్ తీసుకుంటే ఎన్నో రకాల జబ్బుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
ఇక చలి కాలం జామ పండు తింటే జలుబు అవుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో నిజం లేదు. జామ పండ్లలోని ప్రోటీన్‌లు, ఫైబర్ శరీరానికి మేలు చేస్తాయి.
దానిమ్మను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయని చెబుతున్నారు.
ఇక విటమిన్ అధికంగా లభించే కివి పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
పియర్ పండులోని ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చిలికాంలో బరువు పెరగడాన్ని పియర్ పండుతో చెక్ పెట్టొచ్చు. డయాబెటిక్ రోగులకు కూడా పియర్ ఎంతో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.