రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఏ ఆహారాన్ని తీసుకోవాలంటే 

26 February 2024

TV9 Telugu

Pic credit - Pexels

ప్రతి మధుమేహ రోగి ఎప్పటికప్పుడు అధిక రక్తంలో చక్కెర స్థాయిలు లేదా తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలను ఎదుర్కొంటారు. కనుక రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం.  

మధుమేహ రోగి 

డయాబెటిస్‌ను నియంత్రించడానికి ఈ ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ వర్మ చెప్పారు .

నియంత్రణ కోసం  

మొలకెత్తిన ధాన్యాలు, ముఖ్యంగా పప్పులు, బీన్స్, మధుమేహ నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన పచ్చి శెనగలు, పెసలు, చిక్కుళ్లు  తినవచ్చు.

మొలకెత్తిన ధాన్యాలు 

రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కోసం ఆపిల్, పియర్, జామ, ఉసిరి, బ్లాక్‌బెర్రీలను తినండి. ఈ పండ్లలో డైటరీ ఫైబర్, యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. 

పండ్లు 

చక్కెర నియంత్రణకు బెస్ట్ మెడిసిన్.. మెంతికూర, బచ్చలికూర, బీట్‌రూట్ ఆకులు, పచ్చి ఉల్లిపాయలు. వీటిని రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోండి.   

ఆకు కూరలు 

కాంప్లెక్స్ పిండి పదార్థాలు,  డైటరీ ఫైబర్ తృణధాన్యాలలో అధికంగా ఉంటాయి. ఈ రెండు మూలకాలు శరీరంలో జీవక్రియను పెంచుతాయి

తృణధాన్యాలు

వాల్‌నట్స్, బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, గుమ్మడికాయ గింజలను రెగ్యులర్ గా తీసుకోండి. ఇవి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. 

డ్రై ఫ్రూట్స్