24 September 2023
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో స్ట్రాబెర్రీలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా ఉండడంలో వీటివి కీలక పాత్ర.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో విటమిన్ సీ కీలక పాత్ర పోషిస్తుంది. నారింజ పండు విటమిన్ 'సి'కీ పెట్టింది పేరు. చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెంచడంలో నారింజ ఎంతగానో ఉపయోగపడుతుంది.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు దానిమ్మ రసం నిత్యం అలవాటు చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్లూ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిండెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. చిన్నారులకు క్రమంతప్పకుండా బ్లూ బెర్రీస్ ఇవ్వాలని చెబుతున్నారు.
మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కివీది కీలక పాత్ర. విటమిన్ సీ అధికంగా ఉండే ఈ పండు ద్వారా మెదడు చురుకుగా మారుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
చిన్నారులకు చెర్రీలను అలవాటు చేయాలి. వీటిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడు కణాలను రక్షిస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అరటి పండులో ఉండే పొటాషియం మెదడు ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. మానసికంగా చురుకుగా మారేలా చేస్తుంది. ప్రతీ రోజూ కనీసం ఒక అరటి పండును చిన్నారులకు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
యాపిల్స్ ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.