ఈ ఫుడ్‌తో ఒత్తిడి చిత్తవ్వాల్సిందే.. 

18 August 2023

అరటి పండు ఒత్తిడిని పరార్ చేస్తుంది. ఇందులోని ట్రిప్టోఫాన్‌ వల్ల శరీరంలో సెరోటోనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్నికాపాడుతుంది.

గుడ్లు కూడా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్డులో ఉండే 'ట్రిప్టోఫాన్' మెదడు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. 

ఒత్తిడిని చిత్తు చేయడంలో గ్రీన్‌ టీ కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. 

ఇక ఒత్తిడి తగ్గించడంతో డార్క్‌ చాక్లెట్‌ కూడా మెరుగ్గా పని చేస్తుంది. డార్క్‌ చాక్లెట్‌ తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. 

ఒత్తిడి తగ్గాలంటే పసుపు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కర్కుమిన్‌ ఒత్తిడిని దూరం చేస్తుంది 

మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో చేపలు కూడా ఉపయోగపడతాయి. ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగే ఉండే సాల్మన్‌ చేపలను తినాలి. 

నట్స్‌ తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుంది. ఇందులో మెగ్నీషియం, విటమిన్‌ ఇ వంటివి మేలు చేస్తాయి. 

ఒత్తిడి చిత్తవ్వాలంటే రోజు కొన్ని గుమ్మడికాయ గింజలను డైట్‌లో భాగం చేసుకోవాలి. ఇందులోని పొటాషియం ఆందోళనను తగ్గిస్తుంది.